హనుమాన్ మాలను ధరించిన వరుణ్ తేజ్..! 19 d ago
టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. ఇటీవల వరుణ్ తేజ్ నటించిన మట్కా మూవీ డిజాస్టర్ కావడంతో కొంత గ్యాప్ తీసుకున్న వరుణ్, తాజాగా హనుమాన్ మాలలో కనిపించారు. దీంతో మంగళవారం జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం మీడియా తో మాట్లాడుతా మొదటిసారి హనుమాన్ మాల ధరించి స్వామి వారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు.